జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బుధవారం సందర్శించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లాలో ఉన్న ఈ జాతీయ ఉద్యానవనానికి స్నేహితులతో కలిసి వెళ్లారు. వణ్యప్రాణులను అతి దగ్గర నుంచి చూశారు. 'ఈ పార్క్ 24 గంటలు గడిపా.. సరికొత్త అనుభూతి కలిగింది' అని కేతిరెడ్డి ట్వీట్ చేశారు. వారం రోజులుగా విహారయాత్రలో ఉన్న ఆయన హిమాలయ పర్వత శ్రేణిలోని ఓం పర్వతాన్ని కూడా దర్శించుకున్నారు.