శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ. 4. 8 కోట్లను ఎన్డీయే ప్రభుత్వం విడుదల చేసిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలకు ధన్యవాదాలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు.