ధర్మవరంలోని శారదానగర్ కు చెందిన గాజుల ఆనంద్ అనే వ్యక్తి అక్రమంగా నిల్వ ఉంచి అమ్ముతున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఆనంద్ అక్రమంగా మద్యం అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు గురువారం సిబ్బందితో అక్కడికి వెళ్లి 182 మద్యం బాటిళ్లు, 12 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆనంద్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.