ధర్మవరంలో నగలు దోచుకునే దొంగ అరెస్టు

58చూసినవారు
ధర్మవరం పట్టణం వైసీపీ కాలనీకి చెందిన సాకే నారాయణ అనే దొంగను శుక్రవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ టి. శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఒంటరిగా వెళ్తున్న మహిళలపై నారాయణ దాడి చేసి వారి నగలను ఎత్తుకెళ్లేవాడని అన్నారు. వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ సిబ్బందితో కలిసి నిందితుడిని అరెస్టు చేశారన్నారు. అతడి వద్ద నుంచి 6 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్