ఉమ్మడి అనంతపురం జిల్లాల మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్న గుంతకల్లు, తిరుపతి ప్యాసింజర్ రైళ్లను డిసెంబర్ 28 నుంచి రెండు నెలలపాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో సీపీఐ ముదిగుబ్బ మండల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ముదిగుబ్బా లో ఆదివారం మాట్లాడుతూ రైలు రాకపోకల పునరుద్ధరణ చేయకపోతే ఆందోళన నిర్వహిస్తామన్నారు.