ధర్మవరంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ధర్మవరం టౌన్ మార్కెట్ వీధికి చెందిన నరేశ్ అనంతపురం నుంచి ధర్మవరానికి టూ వీలర్ పై వస్తున్నాడు. గొల్లపల్లి గ్రామ సమీపంలో మరూరు రోడ్డులో ఉన్న ఫ్లాట్ల వద్ద ఎదురుగా వచ్చిన మరో టూ వీలర్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో నరేష్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.