ఆర్టీసీ బస్సులలో కార్గో సర్వీసులు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాయని ధర్మవరం ఆర్టీసీ డిపో మేనేజర్ వి. సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ కార్గో సర్వీస్ వారోత్సవాల కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ కార్గో సర్వీస్ లలో మరింత అభివృద్ధి సాధించడానికి సంస్థ కృషి చేస్తుందని తెలిపారు.