ముదిగుబ్బలోని సాయి నగర్ శివారు ప్రాంతాల్లో వీధిలైట్లు వెలగడంలేదు. సుమారు నాలుగు వీధిలైట్లు వెలగకపోడంతో రాత్రి వేళల్లో చీకట్లో బయట తిరిగేందుకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఆరు మాసాలుగా వీధిలైట్లు పనిచేయడం లేదని అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆదివారం కోరారు.