ముదిగుబ్బ మండల కేంద్రంలోని కోడవండ్లపల్లి-గంగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య ఇసుక లోడుతో వెళుతున్న టిప్పర్ వాహనం బుధవారం రాత్రి బోల్తా పడింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ కు గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్ ను ముదిగుబ్బ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అధిక లోడుతో వెళ్లడంతోనే బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు.