వాలంటరీ హెల్త్ సర్వీసెస్ (విహెచ్ఎస్) క్యాలెండరిని ముదిగుబ్బ వైద్యాధికారులు డా. శ్వేత, డా. రాజేంద్ర సోమవారం పీహెచ్సీలో ఆవిష్కరించారు. విహెచ్ఎస్ సభ్యులు హెచ్ఐవి రోగులకు ఏఆర్టి మందులు సక్రమంగా పంపిణీ చేయడమే గాక కొత్త హెచ్ఐవి కేసులను గుర్తించి ఆసుపత్రికి రెఫర్ చేయడం జరుగుతుందన్నారు. హెచ్ఐవి రోగులు సక్రమంగా మందులు వాడనివారికి వీరు అవగాహన కల్పిస్తారని తెలిపారు.