ధర్మవరం మున్సిపల్ కార్యాలయం ముట్టడించిన కార్మికులు

56చూసినవారు
ధర్మవరం మున్సిపల్ కార్యాలయాన్ని సోమవారం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ముట్టడించారు. గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించి కార్మికుల కోసం ధర్మవరంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించి పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ధర్మవరం డివిజన్ కార్యదర్శి జే వి రమణ, కో కన్వీనర్ ఆయుబ్ ఖాన్, కార్మిక సంఘం నాయకులు బాబు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్