అనంతపురం జిల్లాలో విషాదం
గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన శ్రీనివాసులు (34) తీవ్ర కడుపునొప్పి కారణంగా తన ప్రాణాలను తానే తీసుకున్న విషాదకర ఘటన జరిగింది. గురువారం ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించినా, అనంతపురం నుంచి బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స పొందుతున్న సమయంలో శుక్రవారం మృతి చెందాడు. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.