భద్రాచలం భవనం కూలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి

74చూసినవారు
TG: భద్రాచలం భవనం కూలిన ఘటనలో కామేష్ అనే కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మొదట ఆరుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చినా, ఇద్దరు మాత్రమే చిక్కుకున్నారని అధికారులు నిర్ధారించారు. పదకొండున్నర గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని, మృత్యువుతో పోరాడిన కామేష్. కాపాడిన 10 నిమిషాలకే మృతి చెందాడు. శిథిలాల కింద నుంచి రక్షించి, హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్