
గుత్తి; 3న తొండపాడులో టెంకాయల వేలం పాట
గుత్తి మండలం తొండపాడు బొలికొండ రంగనాథ స్వామి ఆలయంలో తిరునాల సందర్భంగా టెంకాయల విక్రయానికి ఫిబ్రవరి 3న వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ రామాంజనేయులు బుధవారం తెలిపారు. టెంకాయల వేలంతో పాటుగా ఫిబ్రవరి 15 నుంచి 2026 పుష్యమాసం ఆఖరు వరకూ ఏడాది పాటు టెంకాయల విక్రయానికి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు వేలం పాట ఉంటుందని తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వారు దేవాలయ అధికారి వద్ద రూ. 5 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.