

గుత్తి: వర్షానికి కురగాయల మార్కెట్ అస్తవ్యస్థం
గుత్తిలోని ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ కూరగాయల మార్కెట్ చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారిపోయింది. శుక్రవారం తెల్లవారి జామున కురిసిన చిన్నపాటి వర్షానికే కూరగాయల మార్కెట్ అపరిశుభ్రంగా మారిపోయింది. దీంతో వ్యాపారస్థులు, కూరగాయల కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కూరగాయల మార్కెట్ లో వర్షపు నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.