ఆసరా సభలో ఎమ్మెల్యే వైవిఆర్ - వీరా మధ్య భగ్గుమన్న విభేదాలు

24182చూసినవారు
పామిడిలో బుధవారం జరిగిన నాల్గవ విడత వైఎస్ఆర్ ఆసరా సభలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి - ఏడిసిసి మాజీ చైర్మెన్ పామిడి వీరాంజనేయులు (వీరా) మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సభలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా వైకాపా నేత వీరా కలుగజేసుకుని మహిళల సభలో ఏడిసిసి చైర్ పర్సన్ నిఖిత (తన కూతురు) మాట్లాడేందుకు ఎందుకు అవకాశం ఇవ్వవని నిలదీశాడు. ఎవరికీ ఇవ్వనని ఎమ్మెల్యే అనడంతో వాగ్వివాదం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్