గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద మహిళా సంఘాల లీడర్లు, సభ్యులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా సంఘం మండల కార్యదర్శి రేణుక, జిల్లా నాయకురాలు నిర్మలమ్మ మాట్లాడారు. ప్రభుత్వమే మద్యం షాపులను నడపాలని డిమాండ్ చేశారు. మద్యం షాపులు తెరిచే సమయాన్ని కుదించాలన్నారు. బడి, గుడి సమీపంలో మద్యం షాపులు ఏర్పాటు చేయకూడదన్నారు. మద్యం షాపుల సంఖ్యను కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు.