గుంతకల్లు పట్టణంలోని ఆలూరు రోడ్డులోని ఉప విద్యుత్తు కేంద్రంలో మరమ్మతులు కారణంగా నేడు (శనివారం) విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్కో ఏఇ రఘు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా అంతరాయం ఉంటుందని ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు ఆయన కోరారు.