అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం అంగన్వాడీ సూపర్వైజర్ నాగేశ్వరి తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థుల హాజరు పట్టికను, ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరము ఉపాధ్యాయుల సమయపాలన పాటించాలని విద్యార్థులు హాజరు శాతాన్ని పెంచాలని తెలిపారు.మోను ప్రకారం విద్యార్థులకు పోషక ఆహారం అందించాలన్నారు.