అనంతపురం జిల్లాలో రెండో రోజు బుధవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. గుత్తి, గుత్తి ఆర్ఎస్ తో పాటు పలు చోట్ల ఉదయం 9 గంటలకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కాగా గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు సమయం మించిపోతుందని పరుగులు తీస్తూ వచ్చారు.