గుత్తి మండలం పి.ఎర్రగుడి గ్రామానికి చెందిన గంగన్న అనే రైతు పంట పొలంలోని వేరుశెనక్కాయల పశువుల మేతకు గుర్తుతెలియని దుండగులు గురువారం నిప్పు పెట్టారు. దాదాపు 20 ఎకరాల్లో పండించిన వేరుశెనక్కాయల పంటను కోసిన తర్వాత పొలంలోనే వామి వేయడం జరిగింది. దుండగులు పాల్పడిన ఈ దుశ్యర్యలో లక్ష రూపాయల వరకు పశువుల మేత కాలిపోయిందని రైతు లబోదిబో మంటున్నాడు.