రెండు రైళ్లు రద్దు

58చూసినవారు
రెండు రైళ్లు రద్దు
గుంతకల్లు రైల్వే డివిజన్ లో ట్రాక్ మరమ్మతులు కారణంగా రెండు రైళ్లు రద్దు చేసినట్లు గురువారం రైల్వే ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గుంతకల్లు - బోధన్ (నెం. 07671) రైలును జూలై నెల 1వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు, కాచిగూడ - గుంతకల్లు (నెం. 07670) రైలును జూలై నెల 2 వ తేదీ నుంచి ఆగస్టు నెల 1వ తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అంతరాయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్