యాడికిలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని శుక్రవారం దేవదాయ శాఖ కమిషనర్ ఆదిశేషయ్య నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు హరికృష్ణ శర్మ, ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఆలయ మాన్యం భూములు గురించి ఆరా తీశారు. మాన్యం భూములు ఎంత ఉన్నాయి? ప్రస్తుతం ఆ భూములను ఎవరు సాగు చేస్తున్నారు అనే విషయాలను అర్చకులు అడిగి తెలుసుకున్నారు.