అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోమవారం హిందూపురంలో పర్యటించారు. మున్సిపల్ పరిధిలోని సూగూరు అభయ ఆంజనేయస్వామి విగ్రహ పనులను ఆయన పరిశీలించారు. చక్కగా విగ్రహాన్ని మలుస్తున్న శిల్పి అశోక్ గడియార్ ను అభినందించారు. త్వరితగతిన విగ్రహాన్ని తయారు చేయాలని, అన్ని సహాయ సహకారాలు తాను అందిస్తానని పేర్కొన్నారు.