మంత్రి సత్యకుమార్ యాదవ్ చిత్రపటానికి తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లె ఎస్సీ కాలనీ వాసులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. చిత్రావతి జలాశయం నిర్మాణంతో తాము ఇళ్ళు కోల్పోయినా వైసీపీ ప్రభుత్వం పరిహారం విషయంలో నిర్లక్ష్యం చేసిందని గత ఎన్నికల సమయంలో బాధితులు కూటమి అభ్యర్థి సత్యకుమార్ దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి సత్యకుమార్ చొరవతో బాధితుల ఖాతాలో పరిహారం సొమ్ము జమ చేయడంతో మంత్రికు కృతజ్ఞతలు తెలిపారు.