పాలవెంకటాపురంలో ఎలుగుబంటి హల్ చల్

539చూసినవారు
బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురం గ్రామ సమీపంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. శుక్రవారం ఉదయం పంట పొలాల్లోకి వచ్చిన ఎలుగుబంటిని చూసిన రైతులు ఎలుగుబంటిని తరమడానికి ప్రయత్నించారు. కానీ ఎలుగుబంటి రైతులపై ఎదురుదాడికి యత్నించింది. రైతులు గట్టిగా కేకలు వేస్తూ ద్విచక్ర వాహనంలో ఎలుగుబంటిని వెంబడించడంతో సమీపంలోని కొండ ప్రాంతంలోకి వెళ్ళింది. దీంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్