విజయవాడ సింగ్‌నగర్‌కు మరోసారి ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి బుడమేరు వాగు కట్ట తెగే అవకాశం ఉందని అధికారులు చెప్పినట్లు సమాచారం. దీంతో సింగ్ నగర్ వాసులు పునరావాసానికి తరలివెళ్లిపోతున్నారు. అటు కృష్ణానది, బుడమేరు వాగు ఉధృతి తగ్గినా ఇంకా సింగ్‌నగర్‌కు కష్టాలు తప్పడంలేదు. ఇళ్లు, రోడ్లు నీటిలోనే ఉన్నాయి. నాలుగు రోజులుగా కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి బుడమేరు వాగు కట్ట తెగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో వరద బాధితులు సింగ్‌నగర్ కాలనీని ఖాళీ చేస్తున్నారు.