మంత్రి కొలుసు పార్థసారధి వైఎస్ జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఉపద్రవం వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. వారికి సహకారం అందించే ప్రయత్నం తాము చేస్తుంటే.. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం జిడ్డు జగన్ చేస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు. వరద ముంపు కారణంగా చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.