బ్రహ్మసముద్రం మండలం ఉపాధి హామీ ఏపీఓగా టెక్నికల్ అసిస్టెంట్ ఆర్. డి. పండరీష్ కు అదనపు బాధ్యతలను అప్పగించినట్లు డ్వామా పిడి సలీంభాష తెలిపారు. ఈ సందర్భంగా ఏపీవో ఆర్. డి పండరిష్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ బ్రహ్మసముద్రం మండల ఉపాధి హామీ కూలీలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. మండల అభివృద్ధి అధికారి నందకిషోర్ నేతృత్వంలో ఉపాధి హామీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.