కళ్యాణదుర్గం ఆర్డీవోగా పని చేస్తున్న రాణి సుస్మితకు డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్ హోదాలో కళ్యాణదుర్గం ఆర్డీవో రాణి సుస్మితను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు బదిలీ చేశారు. ఆమెకు ఆర్డిఓ కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.