కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి గ్రామంలో గిరిజన గురుకుల బాలుర పాఠశాల అర్థాంతరంగా ఆగిపోయిన పనులను వెంటనే ప్రారంభించాలని కళ్యాణదుర్గం సబ్ డివిజనల్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మోహన్ సోమవారం జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కళ్యాణదుర్గం టౌన్ లో అంబేద్కర్ భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. స్పందించిన కలెక్టర్ త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు.