కుందుర్పి మండల కేంద్రంలోని ఫాదర్ ఫెర్రర్ దేవాలయాన్ని స్పానిష్ దేశస్థులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఫాదర్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ఎంతోమంది పేద విద్యార్థులకు చదువును దగ్గర చేసిన మహనీయుడని ఫెర్రర్ అని కొనియాడారు. ఆర్డీటీ సంస్థ ఎంతోమందికి అండగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో పేద విద్యార్థులకు తమ వంతు చేయూత అందిస్తామని తెలిపారు.