కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును ఉమ్మడి అనంతపురం జిల్లా పురావస్తు శాఖ ఏడీ రజిత సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజవర్గంలోని పురాతన ఆలయాల అభివృద్ధికి సహకరించాలని ఆమె ఎమ్మెల్యేను కోరారు. సానుకూలంగా స్పందించిన అమిలినేని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.