కళ్యాణదుర్గం: సత్కార మహాసభను జయప్రదం చేయండి

72చూసినవారు
కళ్యాణదుర్గం: సత్కార మహాసభను జయప్రదం చేయండి
అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈనెల 15న జరుగునున్న సత్కార మహాసభను విజయవంతం చేయాలని అనంత ఉమ్మడి జిల్లాల ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు టైగర్ వన్నూరు స్వామి పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ఎమ్మార్పీఎస్ నాయకులు సమావేశమయ్యారు. టైగర్ వన్నూరు స్వామి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధించిన ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు ఆర్జే ప్రకాష్ ను సత్కార సభలో సన్మానిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్