కళ్యాణదుర్గం రెవిన్యూ డివిజన్ లో గల 11 మండలాల్లో ఈనెల 20వ తేది నుంచి రీ సర్వే జరగనుందని ఆర్డీవో వసంత బాబు మంగళవారం విలేఖరులకు తెలిపారు. గ్రామసభలు, ర్యాలీల ద్వారా ప్రజలకు రీసర్వే ప్రాముఖ్యతను తెలియజేయాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో రీసర్వే కోసం 4బృందాలు ఏర్పాటు చేసి, ప్రతి రోజు 20ఎకరాలు సర్వే చేస్తారన్నారు. కళ్యాణదుర్గం డివిజన్ రైతులు తమ హక్కు పత్రాలతో రీసర్వే ప్రక్రియకు సహకరించాలన్నారు.