కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వివిధ వ్యాధులకు గురై చికిత్సలు చేయించుకున్న నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజా వేదికలో ఎమ్మెల్యే సురేంద్రబాబు చేతుల మీదుగా చెక్కులను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 15 కుటుంబాలకు రూ. 7. 10 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. వాటిని సంబంధించిన వారికి అందజేశామన్నారు.