కళ్యాణదుర్గం: పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

60చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని కోటవీధిలో శనివారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటవీధిలో ఖలీల్ అనే వ్యక్తి అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో రూ. 15వేలు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు అండగా టీడీపీ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్