కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీరామిరెడ్డి తాగునీటి పైప్ లైన్ల నుంచి బురద నీరు ప్రవహిస్తోందని శుక్రవారం పట్టణ ప్రజలు విలేఖరులకు తెలిపారు. ఈ నీటిని ఎలా తాగాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం అధికారులు పంప్ హౌస్, ట్యాంకులను శుభ్రం చేయడం లేదు. దీంతో పైప్ లైన్లు నుంచి కలుషితమైన నీరు సరఫరా అవుతోంది. అధికారులు స్పందించి పంప్ హౌస్, ట్యాంకులు శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.