రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని నార్పల తహశీల్దార్ అరుణకుమారి శుక్రవారం తెలిపారు. మండల పరిధిలోని గూగూడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస మూర్తి, సర్వేయర్ బ్రహ్మయ్య, ఆస్ఐ జ్యోతి, వీఆర్వో చంద్ర పాల్గొన్నారు.