కళ్యాణదుర్గం డివిజన్ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ సబ్ డివిజనల్ లెవెల్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయుటకు గాను అర్హత గల ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్డీవో రాణి సుస్మిత శనివారం విలేఖరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయా మండలాల పరిధిలో ఎస్సీ,ఎస్టీ చట్టాలపై అవగాహన గల వారు ఈ నెల 27లోగా దరఖాస్తులు కళ్యాణదుర్గం రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో అందజేయాలన్నారు.