వాసవి కన్యకాపరమేశ్వరిదేవికి శాఖంబరి అలంకారంతో ప్రత్యేకపూజలు

63చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో ఆషాడమాసం శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవికి శ్రీ శాఖంబరీ అలంకారం చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్