మా కుటుంబాన్ని ఆదుకోండి మహాప్రభు
మడకశిర నియోజకవర్గం, జంబులబండ గ్రామ నివాసి మోహన్ కుమార్ కుటుంబం గత 40 సంవత్సరాలుగా పాతబడ్డ ఇంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి ప్రతిసారి ఇంట్లోకి పూర్తిగా నీరు చేరడంతో తినడానికి, ఉండడానికి చోటు లేకుండా రాత్రంతా మేలుకోవాల్సిన దీన స్థితిలో ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఉన్న కుటుంబాన్ని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.