హైడ్రా కూల్చివేతలు ఆగవని.. కొంత గ్యాప్ మాత్రమే వచ్చిందని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. FTL గుర్తింపు తరువాత హైడ్రా కూల్చివేతలు మొదలవుతాయని చెప్పారు. హైడ్రాకు 15 బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. హైడ్రా నోటీసులు ఇవ్వదని.. వాటర్ బాడీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. కొత్త సంవత్సరం కూల్చివేతలు షురూ అవుతాయని తెలిపారు. చెరువులను అభివృద్ధి చేస్తూ అక్రమ నిర్మాణాలు కూల్చేస్తామన్నారు.