పెనుకొండ పట్టణంలో హిందూపురం పార్లమెంటు సభ్యుల కార్యాలయంలో గురువారం ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటాకి ఎంపీ బి కే పార్థసారథి ఘనంగా నివాళులర్పించారు. రతన్ నోవల్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటు అని అన్నారు. భారత పారిశ్రామిక రంగానికి కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారు. రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.