పెనుగొండ పట్టణంలోని శాఖా గ్రంథాలయములో 57వ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా నెహ్రూ జయంతి ని పురస్కరించుకొని పిల్లల దినోత్సవం నిర్వహించడం జరిగింది. నెహ్రూ చిత్రపటానికి పూలమాలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడడం పిల్లలతో గ్రంథాలయ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి కె. మహబూబ్ బాషా, విద్యార్థులు ఉపాధ్యాయులు, గ్రంథాలయ పాఠకులు, ప్రజలు పాల్గొన్నారు.