పెనుకొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం బ్యాక్లాగ్ పోస్టింగ్లో నియామకమైన ఎన్. అపర్ణకు ఆర్డీవో టి. ఆనంద్ కుమార్ పోస్టింగ్ ఆర్డర్స్ అందజేశారు. ఈ సందర్బంగా అమరాపురం మండలం ఆఫీస్ సబార్డినేట్గా ఆర్డీవో పోస్టింగ్ ఇచ్చారు. విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అపర్ణ ఆర్డీవోకి కృతజ్ఞతలు తెలిపారు.