అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ అధికారుల కన్నుగప్పి అక్రమంగా ఇసుక ను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ను శుక్రవారంనాడు చెన్నేకొత్తపల్లి ఎక్సైజ్ సిఐ. లక్ష్మినారాయణరెడ్డి స్వాధీనం చేసుకొని అనంతరం చెన్నేకొత్తపల్లి పోలీసు స్టేషన్ లో అప్పచేప్పారు. వివరాల మేరకు పెనుకొండ మండలం గుట్టూరు గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని అక్రమంగా ఇసకను ట్రాక్టర్ లోడ్ చేసుకొని చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44 వ జాతీయ రహదారిపై కనుమ వెంకరవన స్వామి దేవస్థానం వైపు వెళ్లే దారిలో వెళ్తుండగా అదే సమయంలో చెన్నేకొత్తపల్లి ఎక్సైజ్ సబ్ సి ఐ. లక్ష్మినారాయణరెడ్డి తన సిబ్బందితో కలిసి అక్రమంగా మధ్యం తరలించేవారికోసం కాచుకొని యుండగా ఆ సమయంలో ఇసుకతో వచ్చిన ట్రాక్టర్ ను గమనించి వాటికి సంబంధించిన బిల్లు లు లేకపోవడంతో వెంటనే చెన్నేకొత్తపల్లి పోలీసు లకు అప్పగించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ పై పోలీసు లు కేసు నమోదు చేశారు.