జాతీయ రహదారిపై జరుగు ప్రమాదాలపై నేషనల్ హైవే అధికారులతో పెనుగొండ సీఐ రాఘవన్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను సీఐ హైవే అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం సోమందేపల్లి పోలీస్ స్టేషన్ లో హైవే అధికారులతో ప్రమాదం జరిగే ప్రదేశాలను గుర్తించి, ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు పాల్గొన్నారు.