పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ డిమాండ్ చేశారు. శనివారం సోమందేపల్లిలో ఏర్పాటు చేసిన భూ పోరాట కేంద్రాన్ని అయన పరిశీలించారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి బి. కేశవరెడ్డితో కలసి ఆవుల శేఖర్ మాట్లాడుతూ గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ప్రభుత్వం వెంటనే పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.