కొండకమర్ల ప్రాధమిక పాఠశాల 2 నందు భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఈ వేడుకలు ప్రారంభించారు. అనంతరం జిల్లా డిటిఎఫ్ అధ్యక్షులు గౌస్ లాజమ్ మాట్లాడుతూ మన రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అందిస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో హెచ్. ఎం నాగరాజు, ఉపాధ్యాయులు చంద్రకళ, సిద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.